
* జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ అయింది
* అంకెలు చూస్తే ఆర్భాటం, పనులు చూస్తే డొల్లతనం
* అసెంబ్లీలో హరీశ్‌రావు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దేశంలో ఎక్కడా లేని ఆర్థిక మాంధ్యం ఇక్కడే ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harishrao) ప్రశ్నించారు. తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి ఆర్థిక మాంధ్యం అనే బూచిని చూపుతున్నారని అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై ప్రసంగం సందర్భంగా ఆయన మాట్లాడారు. గతేడాది అంచనాలు పెంచి చూపించారని, ఇప్పుడు బడ్జెట్ అంచనాలు తగ్గించారని అన్నారు. ఎన్నికలకు ముందు నో ఎల్ఆర్ ఎస్(Lrs), నో బీఆర్ ఎస్ (Brs)అన్నారని, ఇప్పుడు ముక్కుపిండి ఎల్ ఆర్ ఎస్ ఫీజులు వసూలు చేస్తున్నాని విమర్శించారు. ఇప్పుడు భూములు అమ్మకానికి పెడుతున్నారని తెలిపారు. రైతులకు రూ.31వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారని, నిరుద్యోగులకు ఇచ్చిన జాబ్ క్యాలెండర్, జాబ్ లెస్ క్యాలెండర్ (Job Less Calander)అయిందని పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ లో ఉన్న ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఆర్ ఆర్ ఆర్ సాధించింది తామే అన్నారు. భూ సేకరణకు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా అన్నారు. 6 పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు అవి ఏవి అన్నారు. అంకెలు చూస్తే ఆర్భాటం, పనులు చూస్తే డొల్లతనం అన్నారు. బడ్జెట్ అంచనాలు అవాస్తవంగా ఉన్నాయని, ఇంకెంత కాలం ప్రతిపక్ష నేతను తిడుతూ కాలం గడుపుతారని ప్రశ్నించారు.
…………………………………………….