* మరోసారి రాజకీయ జ్యోతిష్యాలు చెప్పను
* సినిమా వాళ్ళ జోలికి కూడా వెళ్ళను
* అంచనాలు తలకిందులైనాయి
* నన్ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు
* వేణు స్వామి వీడియో వైరల్
ఆకేరు న్యూస్, వరంగల్ : ప్రజలారా నన్ను క్షమించండి.. ఇక రాజకీయ జ్యోతిష్యాల జోలికి వెళ్ళను. అంతేకాదు సినిమా వాళ్ళ జ్యోతిష్యాలు కూడా చెప్పను. నరేంద్ర మోది, చంద్రబాబు నాయుడు, వైయస్ జగన్ ల జాతకాలను అంచనా వేయడంలో వైఫల్యం ఉందని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి అంగీకరించారు. తాను చెప్పిన దానికి భిన్నంగా ఎన్నికల ఫలితాలు రావడంతో తనను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోది ప్రభావం తగ్గుతుందని చెప్పాను. అదే విదంగా తగ్గింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయంలో మాత్రం నా అంచనా తప్పింది. వైయస్ జగన్ తిరిగి అధికారంలోకి వస్తాడని చెప్పాను. ఎన్నికల ఫలితాలు విరుద్దంగా వచ్చాయి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తున్నాడు. ఇక నుంచి రాజకీయ పార్టీల జ్యోతిష్యాలతో పాటు , సినిమా పరిశ్రమకు సంబందించిన జ్యోతిష్యాలు కూడా చెప్పను. . నా ఇష్ట దైవాలకు క్షమాపణలు చెబుతున్నానని వీడియోలో పేర్కొన్నారు. ఇపుడు ఆ వీడియో వైరల్ అవుతోంది.
————————-