
ఆకేరున్యూస్, హైదరాబాద్: నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్ కలెక్టర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి జగన్నాథం అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మందా జగన్నాథం.. నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సంతోష్‌నగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ నుంచి పోటీచేసి నాగర్‌కర్నూల్ ఎంపీగా విజయం సాధించారు. పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కూడా కొనసాగారు. తర్వాత కొంతకాలానికి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1996, 1999, 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. 2014 మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అడుగు జాడల్లో నడిచారు.
……………………………………..