TamilNadu CM Vijay Divorce Case Withdrawn
ఆకేరు న్యూస్, డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి , తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది ఆయన విడాకుల కేసు. ఆయన కొత్తపార్టీని 2024 ఫిబ్రవరి 2న స్థాపించారు. ఈ క్రమంలో రెండేళ్లు గడిచాయి. 2026 లో ఎలక్షన్లు వచ్చాయి. విజయ్ పార్టీ అనూహ్యం గా 108 స్థానాల్లో గెలిచింది. ప్రభుత్వం ఏర్పాటులో కొన్ని స్థానిక పార్టీల మద్దతు ఇచ్చాయి.
* విడాకుల కేసు ఉపసంహరణ
ఇదిలా ఉంటే ఆయన భార్య 2025 డిసెంబరు 5న సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. సంగీత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఎట్టకేలకు చెంగల్పట్టులోని కుటుంబ సంక్షేమ కోర్టులో నడుస్తున్న ఈ విడాకుల కేసును సంగీత వెనక్కి తీసుకుంది. ఆ వెటనే న్యాయమూర్తి కేసును పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఇటు విజయ్ తరఫు న్యాయవాదుల నుంచి ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో న్యాయస్థానం కేసును అధికారికంగా ముసేసింది.
* జననాయకుడు సినిమాకు అవాంతరం
విజయ్ చివరి సినిమా జననాయకుడు.. పలు సెన్సార్ అడ్డంకులు, వివాదాల తర్వాత ఈ సినిమా జూలై 23, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించి తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది.విజయ్ సరసన పూజా హెగ్డే నటించగా, బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
