Putha Lakshman
* ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు పోరాటం
* ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్
Putha Lakshman: ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: విద్యారంగాన్ని బలహీనపరిచే ప్రభుత్వ విధానాలు, కుట్రలను తీవ్రంగా వ్యతిరేకించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో మంగళవారం ఏఐఎస్ఎఫ్ జనగామ జిల్లా 3వ మహాసభ నిర్వహించారు. జిల్లా కన్వీనర్ మహమ్మద్ యూనుస్ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో మాజీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రి ఏఐఎస్ఎఫ్ జెండాను ఆవిష్కరించారు.
మహాసభను ఉద్దేశించి పుట్టా లక్ష్మణ్ మాట్లాడుతూ.. విద్యార్థుల హక్కులు, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం ఏఐఎస్ఎఫ్ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
జీవో 97 రద్దు చేయాలి
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి డాక్టర్ గ్యార నరేష్ మాట్లాడుతూ విద్యార్థుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.
ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, విద్యార్థుల హక్కుల సాధన కోసం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరింత బలమైన ఉద్యమాలు చేపట్టాలని మహాసభ పిలుపునిచ్చింది. కార్యక్రమంలో జిల్లా నాయకులు మహమ్మద్ రహమతుల్లా, పృథ్వీరాజ్, అక్షయ్ జీవన్, దామెర రాము, బుస్సా రోహిత్, చింత నిఖిల్, కొలిపాక రంజిత్‌తో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
