SIR Verification
SIR Verification: ఆకేరు న్యూస్, హనుమకొండ: ప్రత్యేక సమగ్ర సవరణ (SIR–స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కాని, అనామాలీస్ జాబితాలో ఉన్న ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలనను వేగవంతం చేయాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి అధికారులను ఆదేశించారు.
మంగళవారం హనుమకొండ న్యూరాయపురలోని 78వ పోలింగ్ కేంద్రంలో మ్యాపింగ్ కాని, అనామాలీస్ జాబితాలోని ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన విచారణ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పరిశీలించారు. అక్కడ జరుగుతున్న విచారణ ప్రక్రియను పరిశీలించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
అనామాలీస్, మ్యాపింగ్ కాని ఓటర్ల సంఖ్య, వారికి జారీ చేసిన నోటీసులు, ఇప్పటివరకు ధ్రువపత్రాలు సమర్పించిన ఓటర్ల వివరాలు, పూర్తయిన విచారణలు, పెండింగ్లో ఉన్న కేసులపై ఏఈఆర్వోలు, బీఎల్వోలను అడిగి తెలుసుకున్నారు.
ఓటర్లు సమర్పించిన ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను స్వయంగా పరిశీలించిన అదనపు కలెక్టర్.. విచారణ కేంద్రానికి వచ్చిన ఓటర్లతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎన్. రవి మాట్లాడుతూ.. మ్యాపింగ్ కాని, అనామాలీస్ జాబితాలో ఉన్న ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలనను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఓటర్లు సమర్పించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ఓటర్ల పేర్లు తుది ఓటర్ల జాబితాలో ఉండేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో హనుమకొండ ఏఈఆర్వో, తహసీల్దార్ రవీందర్ రెడ్డి, ఏఈఆర్వో నాగరాజు, బీఎల్వో సూపర్వైజర్ కవిత, బీఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
