N Ravi
* వాహనాలకు తప్పనిసరిగా GPS ఏర్పాటు
* అదనపు కలెక్టర్ ఎన్. రవి ఆదేశాలు
Paddy Transport: ఆకేరు న్యూస్, హనుమకొండ: ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించడంతో పాటు, కొనుగోలు కేంద్రాల నుంచి కేటాయించిన రైస్ మిల్లులకు ధాన్యం తరలింపును పకడ్బందీగా చేపట్టాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి అధికారులను ఆదేశించారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ ఛాంబర్లో మంగళవారం పౌర సరఫరాలు, సహకార శాఖల అధికారులు, ధాన్యం రవాణా కాంట్రాక్టర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు, జాప్యం తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎన్. రవి మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం రవాణా చేసే ప్రతి వాహనానికి తప్పనిసరిగా GPS ఏర్పాటు చేయాలని సూచించారు. ధాన్యం తరలింపు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎక్కడా జాప్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
స్టోరేజ్ పాయింట్లు సిద్ధం చేయాలి
ధాన్యం నిల్వ కోసం అవసరమైన స్టోరేజ్ పాయింట్లను ముందుగానే సిద్ధం చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులకు సూచించారు. అవసరాన్ని బట్టి ప్రస్తుతం వినియోగంలో లేని ఫంక్షన్ హాళ్లు, సినిమా హాళ్లను కూడా తాత్కాలిక స్టోరేజ్ పాయింట్లుగా ఉపయోగించుకునేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.
ధాన్యం రవాణా వాహనాల డ్రైవర్లకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం ఎక్కడా నిలిచిపోకుండా నిర్ణీత సమయంలో రైస్ మిల్లులకు చేరేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎన్. రవి ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మహేందర్, జిల్లా సహకార అధికారి మోహన్, సివిల్ సప్లై డీటీలు భద్రు నాయక్, నాగేంద్ర ప్రసాద్, భాస్కర్ రెడ్డి, ధాన్యం రవాణా కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
