
Akbaruddin Owaisi
అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
ఆకేరున్యూస్, హైదరాబాద్ : ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ( Akbaruddin Owaisi ) సంచలన వ్యాఖ్యలు చేశారు. మా బ్రదర్స్ ను జైలుకు పంపాలని కొందరు చూస్తున్నారని అన్నారు. జైలులో వైద్యం పేరుతో స్లో పాయిజన్ ఇచ్చి మమ్మల్ని చంపుతారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. అసుద్దీన్ ఒవైసీకి, తనకు దేని గురించీ భయం లేదు.. కానీ ఎవరికి తెలుసు.. ముస్లీం హక్కుల కోసం పోరాడుతున్నది మాత్రం ఓవైసీ బ్రదర్స్ అన్న విషయం అందరికీ తెలుసు. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో .. తెలియదు కదా అని అక్బరుద్దీన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎన్ని చేసినా పాతబస్తీలో తాము బలంగా ఉన్నామని, తమ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని పేర్కొన్నారు.
—————–