చెట్ల పొదల్లో మాదన్న ..
* గోల్కొండ ప్రభువు తానీషా మంత్రులు అక్కన్న – మాదన్నలు
* భద్రాచల రామదాసు మేనమామలు
ఆకేరు న్యూస్ , స్పెషల్ కరస్పాండెంట్ : అక్కన్న – మాదన్నలు మంత్రులుగా ఎంతో ప్రసిద్ది చెందిన సోదరులు . ఆనాటి గోలకొండ నవాబు తానీషా వద్ద మంత్రులుగా పనిచేశారు. వీరి మేనల్లుడే భద్రాద్రి రామదాసుగా పేరుగాంచిన తాహసిల్దార్ కంచర్ల గోపన్న . 1674 నుంచి 1685 వరకు మంత్రులుగా పనిచేశారు.
వీరు హనుమకొండలో భానుజయ్య, భాగ్యమ్మ అనే బ్రాహ్మణ దంపతులకు జన్మించారు. అక్కన్న, మాదన్నల తండ్రి భానుజయ్య హనుమకొండలో గోల్కొండ ప్రభుత్వాధికారి వద్ద ఉద్యోగం చేశాడని చెబుతారు. అక్కన్న- మాదన్నలు అంచెలంచెలుగా ఎదిగి గోల్కొండ నవాబు తానీషా ఆస్థానంలో అత్యంత కీలక వ్యక్తులుగా ఎదిగారు. ఔరంగ జేబు గోల్కొండ కోటను ముట్టడించలేక పోవడానికి ఈ అక్కన్న – మాదన్నలే కారణమని దొంగ చాటుగా మాటు వేసి ఈ ఇద్దరి తలలు నరికించాడని చరిత్ర చెబుతోంది. ..
* చెట్ల పొదల్లో మాదన్న విగ్రహం ..
హనుమకొండకు చెందిన వీరి విగ్రహాలను హనుమకొండలో ఏర్పాటు చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం భావించింది. . నిజానికి ఈ ఇద్దరు అన్నదమ్ములను విడదీసి చరిత్ర కారులు ఎపుడూ చూడలేదు. కారణమేమిటో తెలియదు కాని.. ఒక్క మాదన్న విగ్రహాన్ని మాత్రమే ఏర్పాటు చేశారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ నివాస భవనం ఎదురుగా , సుబేదారి పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ విగ్రహం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఎంఎస్ రాజలింగం ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విశిష్ట అతిథిగా తెలుగుదేశం ప్రభుత్వంలో భారీ నీటిపారుదల శాఖా మంత్రి కడియం శ్రీహరి హాజరయినారు. కొంత కాలం ఈ విగ్రహం ఆలనా- పాలనా బాగానే ఉంది. చాలా సంవత్సరాలుగా మాత్రం ఈ విగ్రహాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో ఈ విగ్రహం చుట్టూ చెట్లు మొలిచినాయి. ఇప్పటికి కూడా పట్టించుకోకపోతే విగ్రహం అస్థిత్వమ లేకుండా పోయే ప్రమాదం ఉందని వరంగల్ నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
———————————–