డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
ముస్లిం సోదరులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు రంజాన్ ( Ramdan ) శుభాకాంక్షలు తెలిపారు. నెలరోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే రంజాన్ పండుగను ముస్లిం సోదరులు తమ కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లిం సోదరులు అల్లా దీవెనలు నిండుగా అందుకోవాలని ఆకాంక్షించారు. మతసామరస్యానికి తెలంగాణ రాష్ట్రం నిలువెత్తు నిదర్శనం అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా నెలరోజుల కఠిన ఉపవాస దీక్షతో క్రమశిక్షణ, ఆధ్యాత్మిక చింతన, దాతృత్వం, ప్రేమ, దయ, సోదర భావం ఐక్యతను పెంపొందిస్తాయని విక్రమార్క పేర్కొన్నారు.
—————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
