
* తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్
* నేటి నుంచే దరఖాస్తు ప్రక్రియ మొదలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ యువత కోసం కాంగ్రెస్ సర్కార్ కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. రాజీవ్ యువ వికాసం పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఈ కొత్త పథకాన్ని ప్రారంభించారు. రూ.6 వేల కోట్లను ఇందుకోసం వెచ్చించనున్నారు. రాష్ట్రంలోని అర్హులైన యువకులకు 50 వేల నుంచి రూ.4 లక్షల వరకు ఆర్థిక సాయం చేయనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకే కాకుండా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు(ఈబీసీ), ఆర్థికంగా బలహీనవర్గాల(ఈడబ్ల్యూఎస్)కు చెందిన వారికి సైతం ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని అమలు చేయాలని తాజాగా నిర్ణయించారు. అందేకాదు.. రూ.50 వేల రుణాలకు వంద శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు. రూపాయి కూడా కట్టే అవసరం లేదని సర్కారు పేర్కొంది. రూ.లక్ష లోపు 90 శాతం, రూ.1-2 లక్షలకు 80 శాతం, రూ.2-4 లక్షల యూనిట్లకు 70 శాతం రాయితీని పెంచినట్లు బీసీ సంక్షేమశాఖ వెల్లడించింది. ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన వ్యక్తులు ఆర్థిక సాయం కోసం ఓబీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా ఏప్రిల్ 5లోగా https://tgobmmsnew.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
నేటి నుంచే..
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘రాజీవ్ యువ వికాసం’ పథకంలో మధ్య దళారుల ప్రమేయం ఉండొద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పటికే అధికారులను ఆదేశించారు. కాగా, ఈ పథకం కోసం నేటి నుంచి ఈబీసీ నిరుద్యోగుల దరఖాస్తుల స్వీకరించనున్నారు. ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకునే వీలుంది. రాజీవ్ యువవికాసం కింద ఈబీసీలకు ప్రత్యేక నిధులను ప్రభుత్వం కేటాయించిన నిధులను నిరుద్యోగులకు ఇవ్వనున్నారు. దరఖాస్తులు చేసుకునే కార్యక్రమం నేటి నుంచి నుంచి ప్రారంభమవుతుండటంతో తెలంణాలోని నిరుద్యోగులు తమ కష్టాలు తీర్చుకోవడానికి ఇది మంచి సమయం అని ప్రభుత్వం చెబుతుంది.
నిధుల కొరత లేదు
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘రాజీవ్ యువ వికాసం’ పథకంలో మధ్య దళారుల ప్రమేయం ఉండొద్దని, ఈ విషయంలో అధికారులు ఎక్కడికక్కడ కట్టడి చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. యువత జీవితాల్లో మార్పును తీసుకురావడానికి అధికారులు అంకితభావంతో పనిచేయాలన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 59 వేలకుపైగా ఉద్యోగ నియామక పత్రాలను అందించామని, ఉద్యోగాలు రాని యువత కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ పథకానికి నిధుల కొరత లేదన్నారు. బ్యాంకు రుణాలతో కలుపుకొని ప్రభుత్వం రూ.9 వేల కోట్ల వరకు ఈ పథకం కోసం పెట్టుబడి పెడుతుందన్నారు.
………………………………….