రంజాన్ సంధర్భంగా పోలీస్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ..
* ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలి
* ముస్లీం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు
– అంబర్ కిశోర్ ఝా
ఆకేరు న్యూస్, హనుమకొండ :
రంజాన్ పర్వదినాన్ని ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ( Warangal Police Commissioner ) ముస్లీం సోదరులకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ముస్లీం సోదరులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా కమిషనరేట్ పరిధిలో ప్రార్ధనలు నిర్వహించుకునే మట్టేవాడ, హనుమకొండ బొక్కల గడ్డ ఈద్గాలను పోలీస్ కమిషనర్ స్థానిక పోలీస్ అధికారులతో కల్సి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రార్ధన సమయంలో పోలీస్ బందోబస్త్ ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులతో సమీక్ఞించారు. ప్రశాంతమైన వాతావరణం లో ముస్లిం సోదరులు ప్రార్ధనలు జరుపుకునే విధంగా బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ కమిషనర్ వెంట స్పెషల్ బ్రాంచ్, హనుమకొండ, వరంగల్, ట్రాఫిక్ ఏసీపీలు జితేందర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, నందిరాం నాయక్, ఇన్స్ స్పెక్టర్లు శ్రీనివాస్,గోపి, సతీష్, శ్రీధర్ తో పాటు ఇతర ఎస్. ఐలు వున్నారు.
———————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
