Ameer Log Movie Release
* నా పాత్ర అందరికీ స్పూర్తిగా ఉంటుంది
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా, వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటికి చెందిన ‘స్పిరిట్ మీడియా’ సంస్థ ఈ మూవీని ఆగస్ట్ 21న విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా నటి వేధా జలంధర్ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించి, సినిమా విశేషాలను పంచుకున్నారు.
* జర్నీ మరియు ఆఫర్..
2019లో కెరీర్ ప్రారంభించిన వేధా, కొన్ని సినిమాలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కి వెళ్లినా రిలీజ్ కాకపోవడంతో థియేటర్ ఆర్ట్స్‌లో నటన నేర్చుకున్నట్లు తెలిపారు. గతంలో ఆమె నటించిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ గురించి దర్శకుడు రమణకు తెలియదని, బషీర్ మాస్టర్ ద్వారా ఆడిషన్స్ ఇచ్చి ఈ అవకాశం దక్కించుకున్నానని వెల్లడించారు.
* పాత్ర స్వభావం – స్ఫూర్తి..
“ఈ సినిమాలో నాది పక్కింటి అమ్మాయి లాంటి క్యారెక్టర్. ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం ఉన్న నా పాత్ర మహిళలకు స్పూర్తినిస్తుంది. నిజ జీవితంలో ఉన్నది ఉన్నట్లు చెప్పే నా ఆలోచనలకు మా అమ్మే స్ఫూర్తి” అని తెలిపారు. ప్రీమియర్ చూసిన వి.ఎన్.ఆదిత్య లాంటి ప్రముఖులు కూడా తన క్యారెక్టర్ సహజంగా ఉందని మెచ్చుకోవడం సంతోషంగా ఉందన్నారు.
* కథలో బిర్యానీ & సాంకేతిక బృందం..
ఈ చిత్ర కథలో ‘బిర్యానీ’ ఒక ముఖ్యమైన పాత్రగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. సింక్ సౌండ్‌తో వర్క్ చేయడం వల్ల లోకల్ బస్తీ వాతావరణంలో షూటింగ్ కొంత సవాలుగా అనిపించినా, స్థానిక ప్రజల సహకారంతో సెట్లో అందరూ ఎంతో మద్దతుగా నిలిచారని చెప్పారు. స్మరణ్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సన్నివేశాల్లోని ఎమోషన్‌ను పదింతలు పెంచిందని కొనియాడారు.
* సినిమాపై నమ్మకం..
ఆరేళ్ల కెరీర్లో తక్కువ సినిమాలే వచ్చినా ఆడియన్స్ యాక్సెప్టెన్సే ముఖ్యమని నమ్మే వేధా, ‘అమీర్ లోగ్’లో ప్రతి క్యారెక్టర్‌కి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. ఎమోషన్ అనేది అందరికీ ఒకటే కాబట్టి, ఈ చిత్రంలోని భాష, యాసలతో సంబంధం లేకుండా సినిమా ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
