800 Gram Baby Treatment
* తనయ చిల్డ్రన్ హాస్పిటల్ అరుదైన చికిత్స
ఆకేరు న్యూస్, హన్మకొండ: అతి తక్కువ బరువుతో జన్మించిన నెలలు నిండని శిశువుకు తనయ చిల్డ్రన్ హాస్పిటల్ వైద్య బృందం విజయవంతంగా చికిత్స అందించింది. కేవలం 800 గ్రాముల బరువుతో పుట్టిన పసికందు ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకుని, ప్రస్తుతం 1 కిలో 600 గ్రాముల బరువుతో సంపూర్ణ ఆరోగ్యంతో తల్లిదండ్రుల చెంతకు చేరింది.
తనయ చిల్డ్రన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డా. అర్జున్ రెడ్డి ఆధ్వర్యంలో శిశువుకు చికిత్స అందించారు. పీడియాట్రిక్ వైద్యులు డా. రసజ్ఞ రెడ్డి, డా. హర్షవర్ధన్ ప్రత్యేక పర్యవేక్షణలో అధునాతన వైద్య సేవలు అందించారు. నిరంతర పర్యవేక్షణ, ప్రత్యేక చికిత్సతో శిశువు ఆరోగ్యం క్రమంగా మెరుగుపడి బరువు పెరిగినట్లు వైద్యులు తెలిపారు.
* తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం
ఇలాంటి చికిత్సకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో అధిక మొత్తంలో ఖర్చయ్యే అవకాశం ఉన్నప్పటికీ.. తమ ఆసుపత్రిలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరలోనే మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. వైద్యాన్ని సేవా దృక్పథంతో అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు పేర్కొంది.
* ‘మా బిడ్డకు ప్రాణం పోశారు’
శిశువు తల్లి హవేలీ రాణి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. బిడ్డ చాలా తక్కువ బరువుతో పుట్టడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యామని, బతుకుతుందో లేదోనని భయపడ్డామని చెప్పారు. అయితే డా. అర్జున్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్యులు ధైర్యం చెప్పి అత్యంత జాగ్రత్తగా చికిత్స అందించారని తెలిపారు. తక్కువ ఖర్చుతోనే తమ బిడ్డను కాపాడారని, తనయ హాస్పిటల్ వైద్య బృందానికి జీవితాంతం రుణపడి ఉంటామని హవేలీ రాణి పేర్కొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
