Aarogyasri Employees Committee
* అధ్యక్షుడిగా గురిజాల తిరుపతి ఏకగ్రీవ ఎన్నిక
ఆకేరు న్యూస్, హనుమకొండ: రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హనుమకొండ జిల్లా కమిటీ ఎన్నికలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం, ఉద్యోగ భద్రతతో పాటు సంస్థ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని నూతన కమిటీ నిర్ణయించింది.
* నూతన కార్యవర్గం ఎన్నిక
జిల్లా అధ్యక్షుడిగా గురిజాల తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షురాలిగా తాలపల్లి పావని ఎంపికయ్యారు. జనరల్ సెక్రెటరీలుగా చిట్టంపల్లి కుమారస్వామి, ఎస్. సతీష్, జాయింట్ సెక్రెటరీలుగా నాగార్జున, కండె స్వామి బాధ్యతలు స్వీకరించారు. ఆర్గనైజింగ్ సెక్రెటరీలుగా సీహెచ్. చక్రపాణి, మేకల రజిత, ట్రెజరర్లుగా ఇంతియాజ్, వి. రామ్ ధన్ ఎన్నికయ్యారు. సోషల్ మీడియా విభాగం బాధ్యతలను టి. మమత, ఎస్. రాజు, మధుకర్ నిర్వహించనున్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా సత్యం యాదవ్, ప్రవీణ్, రాంబాబు, కే. రాజు ఎంపికయ్యారు.
* ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గురిజాల తిరుపతి మాట్లాడుతూ, తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఉద్యోగులంతా ఐక్యంగా ఉంటే సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఉపాధ్యక్షురాలు తాలపల్లి పావని మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యలను కమిటీ దృష్టికి తీసుకువచ్చి సమష్టిగా చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషిస్తామని తెలిపారు. జనరల్ సెక్రెటరీలు చిట్టంపల్లి కుమారస్వామి, ఎస్. సతీష్ మాట్లాడుతూ ఉద్యోగుల హక్కులు, సంక్షేమం కోసం కమిటీ బాధ్యతాయుతంగా పనిచేస్తుందని చెప్పారు. ఇతర నూతన కార్యవర్గ సభ్యులు కూడా ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సమన్వయం, సంక్షేమం కోసం కమిటీతో కలిసి పనిచేస్తామని తెలిపారు.

* నూతన కమిటీకి అభినందనలు
నూతన జిల్లా కమిటీ సభ్యులకు పలువురు ఉద్యోగులు, సహచరులు శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం కమిటీ ఐక్యంగా పనిచేసి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలులో కీలకంగా పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలపై నూతన కమిటీ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
