Konda Surekha Sumanth Father
* ఆసుపత్రిలో ఆరోగ్య పరిస్థితిపై ఆరా..
* మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
ఆకేరు న్యూస్, హనుమకొండ: మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి నార్ల సుబ్రహ్మణ్యేశ్వరరావును మంత్రి కొండా సురేఖ శనివారం పరామర్శించారు. హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అందుతున్న అత్యవసర వైద్య సేవలపై ఆరా తీశారు. సుబ్రహ్మణ్యేశ్వరరావుకు మెరుగైన వైద్యం అందించాలని, వైద్యపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆసుపత్రి వైద్యులకు కొండా సురేఖ సూచించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
* అధిక మోతాదులో నిద్రమాత్రలు
మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి నార్ల సుబ్రహ్మణ్యేశ్వరరావు హనుమకొండలోని తన నివాసంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. అధిక మొత్తంలో నిద్రమాత్రలు తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో అత్యవసర చికిత్స పొందుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
