* 8 మందికి తీవ్రగాయాలు
* ఘటనా స్థలాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్
ఆకేరు న్యూస్, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట మండలంలోని పరిశ్రమలో భారీ పేలుడు(Blost) సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు దుర్మరణం చెందారు. ఎనిమిది మంది కార్మికులు తీవ్రగాయాల పాలయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పెద్దకందుకూరులోని ప్రీమియం ఎక్స్ ప్లోజివ్ పరిశ్రమ(Primium explosive industry)లో ఈ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి బచ్చన్నపేటకు చెందిన ఎం.కనకయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పరిస్థితి విషమించిన కార్మికుడు ప్రకాశ్‌కు హైదరాబాద్ (Hyderabad)లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆ బ్లాక్ లో 16 మంది కార్మికులు ఉన్నారు. పేలుడుకు ఉరుకులు, పరుగులు పెట్టారు. మరో బ్లాక్ లో ఉన్న 45 మంది కార్మికులు కూడా ఆందోళనకు గురయ్యారు.
వారు కూడా భువనగిరి (Bhuvanagiri)ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పేలుడికి భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలాన్ని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య (Beerla Ilayya)సందర్శించారు. పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కార్మికులను పరామర్శించారు. భువనగిరి ఆస్పత్రి వద్ద మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. ప్రమాదాలు జరుగుతున్న యాజమాన్యం చర్యలు చేపట్టడం లేదని, మూడేళ్లలో ఐదుగురు కార్మికులు మృతి చెందారని ఐలయ్య తెలిపారు. వెయ్యి మంది కార్మికులు ఉన్న కంపెనీలో అంబులెన్స్ కూడా లేదన్నారు. కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి కంపెనీలు ధనార్జనకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ఈ ఘటనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు.
…………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
