* పాస్పోర్టుసేవలు సులభతరం
* హైదరాబాద్ లోనే ఇమ్మిగ్రేషన్ అటెస్టేషన్, అపోస్టిల్
* అపాయింట్ మెంట్ గడువు కుదింపు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పాస్ పోర్ట్ సేవల్లో కీలక మార్పులు చేశామని, మరింత సులభతరం చేశామని హైదరాబాద్ ప్రాంతీయ పాస్ పోర్ట్అధికారిణి (Hyderabad Reginol Passport Officer) స్నేహజ వెల్లడించారు. విదేశాలకు వెళ్లేవారు ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో భాగంగా ధ్రువీకరణ పత్రాల అటెస్టేషన్, అపోస్టిల్ కోసం ఢిల్లీ(Delhi)కి వెళ్లేవారని, ఇక దీని కోసం అక్కడకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు. తమ కార్యాలయంలోనే ఈ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. సెక్రటేరియట్ (Secratariat)లోని జీఏడీకి దరఖాస్తు చేసుకుంటే ఆ పత్రాలను పరిశీలించి మరో ఏజెన్సీకి అప్పగిస్తారు.
ఆ ఏజెన్సీ నుంచి తమ వద్దకు ఈ పత్రాలు వస్తాయని స్నేహజ వివరించారు. తమ కార్యాలయంలో నిబంధనల మేరకు వాటిని పరిశీలించి అటెస్టేషన్, అపోస్టిల్ చేసి స్టిక్కర్ తో పాటు స్టాంప్ వేస్తామన్నారు. అలాగే, పాస్ పోర్ట్ అపాయింట్ (Passport Appointment)మెంట్ గడువు 6 నుంచి 8 రోజులకు కుదించినట్టు వివరించారు. 2023లో అందుకు 22 రోజుల సమయం పట్టేదన్నారు. వరంగల్ లో అత్యధికంగా రోజుకు 130, మిగతా కేంద్రాల్లో 90 చొప్పున దరఖాస్తులు పరిశీలించామని ఆమె తెలిపారు. గత ఏడాది సగటున రోజుకు 4,200 అప్లికేషన్లు పరిశీలించామని ఆమె చెప్పారు. గురువారం నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రజల నుంచి అనేక సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయని ఆమె అన్నారు. నేరుగా, మెయిల్ ద్వారా ఇలా వచ్చిన 9.02 లక్షల దరఖాస్తులను గత ఏడాది పరిష్కరించామన్నారు.
………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
