Rayalaseema Districts Lightning Alert
* రాయలసీమకు పిడుగుపాటు హెచ్చరిక
ఆకేరు న్యూస్, డెస్క్: రాయలసీమ జిల్లాల ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. రాగల మూడు గంటల్లో రాయలసీమలోని పలు జిల్లాల్లో వాతావరణం వేగంగా మారే అవకాశం ఉందని, పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (MD) ప్రఖర్ జైన్ ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు.
* ప్రభావితమయ్యే జిల్లాలు ఇవే..
రాబోయే మూడు గంటల్లో ప్రధానంగా క్రింది జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు…
* 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు..
వర్షంతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ గాలుల ధాటికి బలహీనంగా ఉన్న నిర్మాణాలు, చెట్లు కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
