* ఎదురుకాల్పుల్లో 18 మంది మావోలు, ఒక జవాను మృతి
ఆకేరు న్యూస్ డెస్క్ : ఛత్తీస్ గఢ్లో భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. ఎదురు కాల్పుల్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల కాల్పుల్లో ఓ జవాను కూడా మృతి చెందారు. బీజాపూర్ – దంతెవాడ సరిహద్దుల్లో ఈ ఎదురు కాల్పులు జరిగాయి. గంగలూరి పరిధి అండ్రి అడవుల్లో(Andri Forest) మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో దాదాపు 18 మంది వరకు చనిపోయినట్లు తెలుస్తోంది. వారిలో కీలక నేతలు కూడా ఉన్నట్లు సమాచారం. కాగా, ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలను, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
……………………………..
