Published:
Updated: 19 Oct 2024 • 07:20 AM
ఆకేరున్యూస్, అమరావతి: ఈనెల 23న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరుగనుంది. ఉదయం 11 గంటలకు జరిగే సమావేశానికి సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగనుంది. కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేనకు చెందిన మంత్రులు హాజరుకానున్నారు. ఈ మేరకు సీఎస్ కార్యాలయం నుంచి అన్ని ప్రభుత్వశాఖలకు ప్రతిపాదనలు పంపాలని నోట్ పంపారు. గత రెండు రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఏపీలో పారిశ్రామిక అభివృద్ధిపై ఆరు కొత్త పాలసీలు తీసుకొస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈసారి జరుగనున్న కేబినెట్లో మరికొన్ని అంశాలను చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రధాన హామీల అమలుపై చర్చించనున్నారు.
……………….
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
