* రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్
* పట్నం ఏ పార్టీ వ్యక్తో ప్రభుత్వం చెప్పాలి
* మాజీ మంత్రి హరీష్ రావు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : చీప్ విప్ గా పట్నం మహేందర్ రెడ్డి(Patnam Mahenderreddy) నియామకం రాజ్యాంగ విరుద్ధమని, కాంగ్రెస్ పార్టీ(Congress Party) రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు(Harishrao) అన్నారు. బిల్ పాస్ చేయించడం, ప్రభుత్వ బిజినెస్ జరిగేలా చేయడం చీప్ విప్ బాధ్యత అని, మహేందర్ రెడ్డి ఇప్పుడు ఎవరికి విప్ ఇష్యూ చేస్తారని, అధికార పార్టీ సభ్యులకా… ప్రతిపక్ష పార్టీ సభ్యులకా.. అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన, రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని అనడానికి ఇది మరో ఉదాహరణ అన్నారు. పీఏసీ, చీప్ విప్ ఎంపిక విషయాల్లో ఇది స్పష్టంగా అర్థమవుతున్నదని చెప్పారు. శాసనసభ సమావేశాలు ముగిసే నాటికి బిఆర్ఎస్(Brs) పార్టీ సభ్యుల సంఖ్య 38 అని స్పీకర్ గారే చెప్పారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సభ్యులు కూడా అన్నారని, ఇప్పుడు మళ్లీ వాళ్లు మా పార్టీ వాళ్లు కాదు అని మాట్లాడుతున్నారని తెలిపారు.
చైర్మెన్ వద్ద మహేందర్ రెడ్డి అనర్హత పిటిషన్ పెండింగ్ ఉండగా, అధికార పార్టీ చీఫ్ విప్ గా అదే కౌన్సిల్ చైర్మన్(Council Chairman) బులిటెన్ ఎలా ఇష్యూ చేస్తారని ప్రశ్నించారు. మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తరపున ఎన్నికల్లో ప్రచారం చేశారని, పార్టీ ఫిరాయింపు చేశాడని దాంతో స్పష్టంగా అర్థమవుతుందని వెల్లడించారు. మార్చి 15 నాడు చీఫ్ విప్ అని ఆర్డర్ ఇస్తే, పంద్రాగస్టు, జూన్ 2, సెప్టెంబర్ 17 ఎమ్మెల్సీ గా జెండా ఎగురేస్తారని జేఏడీ అఫీషియల్ జీవో ఎలా ఇస్తుందన్నారు. అనర్హత వేటు వేయాల్సిన కౌన్సిల్ ఛైర్మన్ స్వయంగా .. పట్నం మహేందర్ రెడ్డి చీఫ్ విప్ ఎంపికైనట్లు బులెటిన్ ఇవ్వటం రాజ్యాంగ విరుద్ధం అని తెలిపారు. పీఏసీ చైర్మన్(Pac Chairman) పదవి విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలానే వ్యవహరించిందని వివరించారు. ఆరెకపూడి గాంధీ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని స్వయంగా సీఎం, మంత్రులు చెప్పారని, పట్నం మహేందర్ రెడ్డి ఏ పార్టీకి చెందిన వ్యక్తో ప్రభుత్వమే చెప్పాలన్నారు.
………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
