* విద్యుత్ అంశంలో న్యాయ విచారణ కోరింది బీఆర్ ఎస్సే
* కమిషన్ ముందు ఎందుకు హాజరుకావడం లేదు..
* అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఈరోజు సాయంత్రంలోగా విద్యుత్ కమిషన్‌కు కొత్త చైర్మన్‌ను నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ విద్యుత్ అంశంలో న్యాయ విచారణ కోరింది బీఆర్ ఎస్సే అని, కమిషన్ ఎదుట హాజరై ఆ పార్టీ నేతలు వివరాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. విద్యుత్ సంక్షోభం నుంచి తెలంగాణను బయట పడేసింది కాంగ్రెస్ పార్టీయే నని చెప్పారు. ఛత్తీస్‌గఢ్, యాదాద్రి పవర్ ప్లాంట్లపై విచారణ జరుగుతోందన్నారు. 24 గంటలూ కరెంట్ ఇవ్వాలని చంద్రబాబు హయాంలోనే నిర్ణయం జరిగిందని గుర్తు చేశారు. యూపీఏ ప్రభుత్వ నిర్ణయాల వల్లే హైదరాబాద్ ఆదాయం పెరిగిందని వెల్లడించారు. కాగా, కేసీఆర్ పిటిషన్‌తో పవర్ కమిషన్ చైర్మన్‌ను మార్చాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే.
—————————————-