గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
* గవర్నర్‌తో రేవంత్ రెడ్డి భేటీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ( Governer ) ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఉదయం రాజభవన్‌కు వెళ్లిన ఆయన గవర్నర్‌తో భేటీ అయ్యారు. తాజాగా సీపీ రాధాకృష్ణన్‌ను మహారాష్ట్ర గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపత్తి ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఆయన త్వరలో అక్కడ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ను కలిసిన ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఇక తెలంగాణ కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ( Zishnu dev Varma ) నియమితులైన విషయం తెలిసిందే. మరో రెండు రోజుల్లో జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన ఆయన.. ప్రస్తుత ఇంచార్జి గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ స్థానంలో రానున్నారు.
———————————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
