* తెగిపడ్డ 11 కేబీ విద్యుత్ తీగలు
* ఘటనలో ఇద్దరు మృతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారు ఝామున దారుణం జరిగింది.. విద్యుత్ హై టెన్షన్ తీగలు తెగి పడడంతో ఆలయంలో నిద్రిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వారితో పాటు రోడ్డుపై నిద్రిస్తున్న కుక్క కూడా మృతి చెందింది. విద్యుత్ తీగలు పడడంతోనే మంటలు చెలరేగడంతో సమీపంలో ఉన్న వారు పోలీసులకు విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న విద్యుత్ సిబ్బంది ఘటనా ప్రదేవానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనలో మృతి చెందిన వారు ఆలయ ప్రాంతంలో భిక్షాటన చేసే వారుగా గుర్తించారు. ఇద్దరి మృత దేహాలు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించిన ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
…………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
