* కేదార్నాథ్ లో కూలిన హెలికాప్టర్
* ఏడుగురు దుర్మరణం
* ఘటనపై ఏఏఐబీ దర్యాప్తు
* చార్ ధామ్‌లో హెలికాప్టర్ ఫ్రీక్వెన్సీ తగ్గించాలని డీజీసీఏ ఆదేశం
ఆకేరు న్యూస్, డెస్క్ : అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం ఘటన మరువక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. చార్ ధామ్ యాత్రలో ఒకటైన కేదార్నాథ్ సమీపంలో ఒక ప్రైవేట్ హెలికాప్టర్ (Helicopter Crash) కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన రుద్రప్రయాగ జిల్లాలోని బాద్సౌ ప్రాంతంలో జరిగింది, హెలికాప్టర్ సిర్సి హెలిప్యాడ్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. హెలికాప్టర్లో మొత్తం ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. ప్రాథమిక సమాచారం మేరకు.. ప్రమాదానికి ప్రతికూల వాతావరణం కారణమని తెలుస్తోంది. కూలిపోయిన హెలికాఫ్టర్‌ను ఆర్యన్ ఏవియేషన్ (ARYAN AVIYATION) సంస్థకు చెందిన హెలీకాప్టర్‌గా అదికారులు గుర్తించారు. సమాచారం డెహ్రాడూన్ నుంచి కేథార్ నాథ్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానంలో ఏడుగురు ప్రయాణికులు ఉండగా, అందరూ చనిపోయారు. పైలట్, ఓ చిన్నారితో సహా హెలికాఫ్టర్ లోని ఏడుగురు మరణించారు. ఉత్తరాఖండ్‌లోని చార్ ధామ్ గమ్యస్థానాలలో ఒకటైన కేదార్‌నాథ్‌కు వెళ్లే యాత్రా మార్గానికి సమీపంలో ఈ తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంపై ఏఏఐబీ (AAIB) దర్యాప్తు ప్రారంభించింది. మరోవైపు చార్ ధామ్‌లో హెలికాప్టర్ సేవలపై డీజీసీఏ (DGCA) ఫోకస్ పెట్టింది. హెలికాప్టర్ ఫ్రీక్వెన్సీ తగ్గించాలని ఆయా సంస్థలను ఆదేశించింది.
……………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
