ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన విలేకరి శ్రీకాంత్ రెడ్డి పై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ,విలేకరులపై దాడులను ఆపాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని బుధవారం ఏటూరునాగారం మండల కేంద్రంలో ప్రింట్ మరియు ఎలెక్ట్రానిక్ మీడియా విలేకరులు నల్ల బ్యాడ్జిలు ధరించి ఏటూరునాగారం బస్టాండ్ సమీపంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఏటూరునాగారం బస్టాండ్ నుండి ఐటీడీఏ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ కు వినతి పత్రం అందించారు.ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ అబ్జల్ పాషా, ఉపాధ్యక్షులు కుదురుపాక రాజేశ్,ప్రధాన కార్యదర్శి అలువాల శ్రీనివాస్,విలేకరులు నూక ప్రభాకర్,వసంత రమేష్,లకుమయ్య,చింతపల్లి వెంకటేశ్వర్లు,గంపల శివ,వసంత రమేష్ ,బోడ సత్యం,జూపాక కృష్ణ,లాలయ్య,యగ్గడి వెంకటేశ్వర్లు,కుదురుపాక ప్రవీణ్,గౌరీశంకర్,గణపనేని రవి ,ప్రతాప్, తిరుమల్,దామోదర్,పిట్టల శివ, చిటమటా గంగాధర్,లకుమయ్య, తదితరులు పాల్గొన్నారు.
………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
