రెండు దశాబ్దాలుగా స్నేహితురాలు సోఫియా అల్లౌచే తో మహిళా మంత్రి పెన్నీ వాంగ్ సహజీవనం
స్వలింగ వివాహాలకు ఆస్ట్రేలియాలో చట్టబద్దత
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా స్వలింగ సంపర్క వివాహాలు పెరిగిపోతున్నాయి. కొన్ని దేశాల్లో స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్దత కూడా లభించింది. తాజాగా ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ తన భాగస్వామి సోఫియా అల్లౌచే ని వివాహం చేసుకున్నారు. గత 20 ఏళ్లుగా సోఫియాతో పెన్నీ వాంగ్ సహజీవనం చేస్తున్నారు. తాజాగా సోఫియాను పెళ్ళి చేసుకున్న విషయాన్ని పెన్నీ వాంగ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. శనివారం ఆడిలైడ్‌లోని ఓ తోటలో జరిగినట్లు ఆమె తెలిపారు. ఆత్మీయులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఈ పెళ్ళికి హాజరయినట్లు ఆమె చెప్పారు. ఆస్ట్రేలియాలో 2017 నుంచి స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేశారు. పెన్నీ వాంగ్ కంటే సహచరి సోఫియా 8 ఏళ్ళు చిన్నది . యూనివర్సిటీ ఆఫ్ ఆడిలైడ్ విద్యార్థి సంఘఘానికి అధ్యక్షురాలిగా పనిచేశారు. ఇపుడు సౌత్ ఆస్ట్రేలియా హెల్త్ మరియు హ్యూమన్ సర్వీసెస్ విభాగంలో మేనేజర్‌గా పనిచేస్తోంది. పిల్లల ఆరోగ్యం , మానసిక సమస్యలకు సంబందించిన అంశాల్లో సోఫియా నిపుణురాలు .
.