* మాస్కో లోని కన్సర్ట్ హాల్లో విచక్షణారహితంగా కాల్పులు
* 40 మంది మృతి , 100 మందికి పైగా గాయాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రష్యా ( Russia ) రాజధాని మాస్కో సమీపంలోని క్రాకస్ సిటి కన్సర్ట్ హాల్లో టెర్రరిస్ట్లు కాల్పులకు( Moscow Attacked) తెగబడ్డారు. 40 మందికి పైగా మృతి చెందగా 100 మంది గాయపడ్డారు. అంతర్జాతీయ వార్తా సంస్థ ల సమాచారం ప్రకారం
పిక్ నిక్ అనే రాక్ సంగీత బృందం కన్సర్ట్ హాల్లో ప్రదర్శన చేస్తోంది. వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు.ఒక్కసారిగా ఆధునిక తుపాకులతో , బాంబులతో లోపలికి ప్రవేశించిన దండగులు ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో ప్రజలు పరుగులు పెట్టారు. కొంత మంది కుర్చీల కింద దాక్కునే ప్రయత్నం చేశారు. టెర్రరిస్ట్లు బాంబులు విసురుతూ, కాల్పులు జరుపుతూ భీతావహ పరిస్థితి ని సృష్టించారు. రష్యా చరిత్రలో ఇదీ అతిపెద్ద టెర్రరిస్ట్ దాడిగా చెబుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు న్నాయని తెలుస్తోంది. కాగా ఐఎస్ఐఎస్ సంస్థ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించుకుంది.
————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
