Ambedkar Jayanti celebrations villages
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్, చిల్పూర్ మండలాల్లోని గ్రామ గ్రామాన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి.
* తాటికొండలో..
గ్రామంలో సర్పంచ్ మారపాక సృజన శ్రీనివాస్ అన్ని కులాలు, మతాలు, కుల సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎడమ కట్టుమల్లు, వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు, యువజన సంఘాలు గ్రామస్తులు పాల్గొన్నారు.
“విద్యుత్ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డిఈ సారయ్య ఎస్సీ,ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సంఘం డివిజన్ అధ్యక్షుడు గబ్బెట సుధాకర్, ఏడిఈ పి.రణధీర్ రెడ్డి, ఐఎన్టియుసీ 327యూనియన్ రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రసిడెంట్ నీలం ఐలేష్
అసిస్టెంట్ అకౌంట్స్ అధికారి రవీందర్, జేఏఓ జనార్ధన్, నాయకులు లకావత్ కాలురామ్, గునిగంటి కృష్ణం రాజు,గుర్రం సురేష్, సుధాకర్, బి.రమేష్, పి.సందీప్,వెంకటేష్,పి.అశోక్,బాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
* పలగుట్టలో …
చిల్పూర్ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో సర్పంచ్ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ రఫీ, వార్డు సభ్యులు, దేవస్థానం డైరెక్టర్లు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
* ఆయా గ్రామాల్లో…
స్టేషన్ ఘన్ పూర్ మండలంలోని కొత్తపల్లి, మీదికొండ, ఇప్పగూడెం గ్రామాలలో చిల్పూర్ మండలంలోని నష్కల్, రాజవరం, వెంకటాద్రి పేట, కొండాపూర్, మల్కాపూర్ గ్రామాలలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
