Potlapalli Sridhar Rao vows
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా చిల్పూర్ దేవస్థానం గుట్ట పైకి మెట్లు నిర్మాణం పూర్తి అయిన సందర్భంగా మెట్టుకు ఒక కొబ్బరికాయ చొప్పున 580 మెట్లకు 580 కొబ్బరికాయలు కొట్టి మంగళవారం మొక్కుబడి చెల్లించారు శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు.
దేవస్థాన అభివృద్ధి పనుల్లో భాగంగా మెట్లు కట్టించాలి అనే కోరిక గతంలో కోరుకాగా నేడు పూర్తయినా సందర్భంగా మొక్కుబడులు చెల్లించి ఆనందం వ్యక్తం చేసారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాస్టర్ ప్లాన్ తో ఉన్నారని త్వరలోనే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టను ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డైరెక్టర్లు, కౌన్సిలర్లు చిల్పూర్ మండల నాయకులు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, పల్లగుట్ట గ్రామ నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
