* ముంబయి పోలీస్ అలర్ట్
* బిష్ణోయ్ గ్యాంగ్ గా అనుమానం
ఆకేరు న్యూస్, డెస్క్: ఎన్ సీపీ నేత బాబా సిద్దిఖీ ( Baba Siddique ) పై దుండగులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. తన కుమారుడి కార్యాలయంలో సమీపంలో కారులో కూర్చున్న ముగ్గురు దుండగులు కాల్పులు జరిపారు. కాల్పులు శబ్దం తో అప్రమత్తం అవకుండా భాణాసంచా కాల్చినట్లుగా తెలిసింది. పటాకుల శబ్దం ఒక వైపు వినబడుతుండగానే దుండగులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారని తెలుస్తోంది. చికిత్స కోసం హుటాహుటిన బాబా సిద్దిఖీని లీలావతి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బాబా సిద్దిఖీ మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాల్పులు జరిపిన ముగ్గురు దుండగుల్లో ఇద్దరినీ పోలీస్లు అదుపులోకి తీసుకున్నారు. మరొకరిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీస్ అధికారులు చెబుతున్నారు. గత యాభై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్న సిద్దిఖీ మూడు సార్లు ముంబయి బాంద్రా నుంచి ఎమ్మల్యేగా మూడు సార్లు ఎన్నికయ్యారు. ఒక సారి మంత్రిగా కూడా పనిచేశారు. సిద్దిఖీ హత్యకు సంబందించి అనేక కారణాలను పోలీస్లు విశ్లేషిస్తున్నారు. బాబా సిద్దిఖీ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ కారణమని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.
————————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
