
* సంగీతంతో సినిమాలకు ప్రాణం పోశాడు..
*హీరోల విజయానికి కారణమయ్యాడు…
* నిర్మాతల పాలిట కల్పతరువుగా మారాడు..
* సంగీతంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశాడు…
* బాలీవుడ్ సంగీత సామ్రాజ్యాన్ని ఏలాడు…
* నేడు సంగీత దర్శకుడు ఆర్ .డి బర్మన్ జయంతి
ఆకేరు న్యూస్, డెస్క్ ః ఏ షాం మస్తానీ.. మధు హోష్ కియే జాయే… అంటూ హమ్ చేస్తూ లేదా విజిల్ వేస్తూ …పాడుకుంటుంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో అది అనుభవించిన వారికే తెలుస్తుంది.. ఆర్ డీ బర్మన్ ఈ జనరేషన్‌కు ఈ పేరు ఎక్కువగా తెలియక పోవచ్చు..కాని ఓ ఇరువై ముప్పై ఏళ్లు వెనక్కి చూస్తే ఆర్ డి బర్మన్ అంటే పూర్తి పేరు రాహుల్ దేవ్ బర్మన్ ఏంటో తెలుస్తుంది… ఈ రోజు యాభై ఏళ్ల వయస్సు ఉన్న వారిని అడిగితే ఆర్ డీ బర్మన్ అంటే \ఏంటో చెప్తారు. హిందీ సంగీత ప్రపంచాన్ని ఏలిన రారాజు ఆర్ డి బర్మన్.. ఆయన పాటలు శ్రోతలను ఉర్రూతలూగించేవి. తన స్వర మాధుర్యంతో బినాకా గీత్ మాలాను జనరంజకంగా నడిపించిన అమీన్ సయానీ నోటి నుండి ఆర్ డీ బర్మన్ అనే పేరు ఎన్ని సార్లు ఉచ్చరించబడిందో మాటల్లో చెప్పలేం…బినాకా గీత్ మాలాలో టాప్ సాంగ్స్ అన్నీ ఆర్ డి బర్మన్ వే ఉండేవి.. ఈ తరానికి బినాకా గీత్ మాలా అంటే తెలియకపోవచ్చు.. రేడియోనే వినోద సాధనంగా ఉన్న రోజుల్లో బుధవారం రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు వచ్చే బినాకా గీత్ మాలా కోసం శ్రోతలు
వారం మొత్తం ఎదురు చేసేవారు. ఆర్ డి బర్మన్ మొత్తం 331 చిత్రాలకు సంగీత ద ర్శకత్వం వహించారు.కిషోర్ కుమార్, లతా మంగేష్కర్ ఆశా భోంస్లే,మహ్మద్ రఫీ లాంటి వారితో పనిచేశారు. ఎంతో మంది యువ సంగీత దర్శకులకు మార్గదర్శకంగా నిలిచారు. ఆర్ బర్మన్ పాట అంటే చెవులు కోసుకోవాల్సిందే…రాజేష్ ఖన్నా,ధర్మేంద్ర,శశికపూర్,అమితా బచ్చన్, రిషికపూర్, కమల్ హాసన్ ల సినిమాలు హిట్ అవడంలో ఆర్ డి బర్మన్ పాత్ర మరువలేనిది. 1970 దశకంలో ఆర్ డి బర్మన్ మర్చిపోలేని పాటలకు సంగీతాన్ని ఇచ్చారు.ఏ షామ్ మస్తానీ మధుహోష్ కియే జాయె… ప్యార్ దీవానా హోతా హై…యే జో మొహబ్బత్ హై…జిస్ గలి మే తేరా ఘర్… దమ్ మారో దమ్…ఫూలోన్ కా తారోన్ కా “కంచి రే” కంచి” “రైనా బీటీ జాయే”, “చింగారి కోయి భడ్కే”, “కుచ్ తోహ్ లోగ్ కహెంగే” మరియు “యే క్యా హువా…ఓ మేరే దిల్ కే చైన్…చలా జాతా హూన్…ఆవో నా, గాలే లో జీవన్ సా కజ్రా లగాకే గజ్రా సజాకే… …రో నా కభీ నహిన్ రోనా…సామ్నే యే కౌన్ ఆయా…యే జవానీ హై దీవానీ…జాన్-ఎ-జాన్ ధూండతా ఫిర్ రహా హూన్ తుమ్హే రాత్ దిన్వా, దియే జల్తే హై ఫూల్ ఖిల్తే హైన్…కర్వతీన్ బదల్తే రహే…జై జై శివ్ శంకర్…సునో కహో కహా సునాబ్, సఫ్ కహో కహా సునా…వంటి ఎవర్ గ్రీన్ పాటలు ఉన్నాయి.1975లో బర్మన్ సంగీతం అందించిన దీవార్ , ఖేల్ ఖేల్ మే , వారెంట్ , ఆంధీ , ఖుష్బూ , ధరమ్ కరం మరియు షోలే చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాయి, ముఖ్యంగా షోలే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచి భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద హిట్‌గా నిలిచింది . మెహబూబా మెహబూబా…యే దోస్తీ హమ్ నహిన్ష…వంటి పాటలు ఇంకా చెవుల్ల్లో గింగురుమంటూనే ఉంటాయి.మూడు దశాబ్దాల పాటు సంగీత ప్రపంచాని్న ఏలిన ఆర్ డి బర్మన్ 1994 లో 54 ఏళ్ల వయస్సులోనే శాశ్వతంగా వీడ్కోలు పలికాడు…సంగీత ప్రపంచంలో ఆర్ డి బర్మన్ కు ఓ ప్రత్యేక చాప్టర్ ఉంటుంది.
……………………………………………..