* పరిస్థితులు అదుపు తప్పడంతో తీవ్ర చర్యలు
* రిజర్వేషన్ల విషయంలో చెలరేగిన హింస
* ఇప్పటి వరకు 300 మంది మృతి
* ప్రధాని ఇంట్లోకి చొరబడ్డ ఆందోళనకారులు
* సైనిక సూచనలతో ప్రధాని పదవికి హసీనా రాజీనామా
* దేశం విడిచి పరారీ
* భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా!
ఆకేరు న్యూస్ డెస్క్ : బంగ్లాదేశ్ (Bangladesh )లో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. దీంతో దేశాన్ని సైన్యం (Army) తన చేతుల్లోకి తీసుకుంది. సైన్యం హెచ్చరికలతో ప్రధాని షేక్ హసీనా( Prime Minister Sheikh Hasina) తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు.. ఆమె దేశం విడిచి వెళ్లిపోయారు. రిజర్వేషన్లకు (Reservations) వ్యతిరేకంగా కొంత కాలంగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు హింసకు దారి తీశాయి. ఈ హింసలో ఇప్పటి వరకు 300 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లపై ప్రధాని షేక్ హసీనా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి నాయకులు నిరసనలకు పిలుపునివ్వడంతో ఆ దేశంలో అశాంతి నెలకొంది. బంగ్లాదేశ్ (Bangladesh )లో పోలీసులు (Police), ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారుల (Anti-government protesters) కు మధ్య కొన్నాళ్లుగా ఘర్షణలు జరుగుతున్నాయి. సిరాజ్గంజ్ జిల్లా (Sirajganj District) లో ఒక పోలీసు స్టేషన్‌పై వేల మంది దాడి చేయడంతో 13 మంది పోలీసు అధికారులు మరణించారు. ఆదివారం బంగ్లాదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో ప్రదర్శనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ (Tear gas) ఉపయోగించారు. రబ్బర్ బుల్లెట్ల (Rubber bullets) ను ప్రయోగించారు. ఆదివారం నాటి ఘర్షణలలో సుమారు 200 మంది గాయపడ్డారు. జూలై (July) లో ఈ ఆందోళనలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 300 మందికి పైగా మరణించారు. నిరసనలను నియంత్రణలోకి తెచ్చేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా దేశవ్యాప్తంగా రాత్రి వేళ కర్ఫ్యూ (Curfew) అమలు చేస్తున్నారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో సైన్యం రంగంలోకి దిగింది. దేశ రక్షణ కోసం ప్రధాని తన పదవికి రాజీనామా చేయాలని సూచింది. అందుకు కేవలం 40 నిమిషాల సమయం ఇచ్చింది. దీంతో ప్రధాని రాజీనామా చేశారు. దేశం విడిచి వెళ్లిపో్యారు. ప్రస్తుతం ఆమె భారత్ (India) లో ఆశ్రయం పొందుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల రీత్యా తాత్కాలిక ప్రభుత్వం పాలనను సమీక్షిస్తుందని, అన్ని రాజకీయ పార్టీలను కలుస్తామని ఆర్మీ చీఫ్ (Army chief) తెలిపారు. సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలలో కోటా రద్దు చేయాలన్న డిమాండ్‌తో గత నెలలో మొదలైన ఈ నిరసనలు క్రమంగా విస్తృత రూపందాల్చుతూ ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారాయని వెల్లడించారు.
————————–