Private Schools
* తెలంగాణ విద్యాశాఖ కఠిన నిర్ణయం
Private Schools| ఆకేరు న్యూస్, హైదరాబాద్: నిబంధనలు పాటించకుండా ఆదాయ, వ్యయాల ఆడిట్ నివేదికలు, వార్షిక ట్యూషన్ ఫీజు వివరాలను సమర్పించని ప్రైవేట్ పాఠశాలలపై తెలంగాణ విద్యాశాఖ చర్యలకు సిద్ధమైంది. స్పందించని పాఠశాలలకు వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్.. RJDలు, DEOలను ఆదేశించారు.
12 వేలకుపైగా ప్రైవేట్ బడులు
రాష్ట్రవ్యాప్తంగా 12 వేలకుపైగా ప్రైవేట్ పాఠశాలలు ఉండగా.. ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసే నాటికి కేవలం 700 పాఠశాలలు మాత్రమే తమ ఆదాయ-వ్యయాల ఆడిట్ నివేదికలు, ఫీజుల వివరాలను ఆన్లైన్లో పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, నిబంధనల ఉల్లంఘనపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
