Bay of Bengal Low Pressure Weather Alert
* వాయుగుండంగా మారే అవకాశం
ఆకేరు న్యూస్ , నెట్వర్క్, అమరావతి : బంగాళాఖాతం ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. ఇది సోమవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం నాటికి మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
ఆ తర్వాత కూడా పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ బుధవారం నాటికి దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభావంతో ఇవాళ, రేపు అక్కడక్కడా (Rain Alert) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధ, గురువారాల్లో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
మరోవైపు కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇవాళ అల్లూరి సీతారామరాజు, నంద్యాల, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే (Rain Alert) అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
