CM Chandrababu
ఆకేరు న్యూస్, డెస్క్ చిత్తూరు: ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ, రేపు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కుప్పం కొత్తపేటలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు.
అలాగే 34 సెంట్ల భూమిలో రైతు బజార్ ఏర్పాటుకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. హంద్రీనీవా కాలువ ద్వారా రామకుప్పం రాజుపేటకు కృష్ణా జలాలు చేరుకోవడంతో గుండిశెట్టిపల్లి వద్ద సీఎం చంద్రబాబు కృష్ణా జలాలకు జలహారతి ఇవ్వనున్నారు.
అనంతరం కుప్పం ప్రాంతానికి కృష్ణా జలాలను విడుదల చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
