ఎన్హెచ్ఎం, ఎన్యూహెచ్ఎం నియామకాలు
* రూ.లక్ష వరకు జీతం.
* వెంటనే అప్లై చేసుకోండి
ఆకేరు న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం : వైద్య రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ (DM&HO) ఆధ్వర్యంలో నేషనల్ హెల్త్ మిషన్ (NHM), నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ (NUHM) పరిధిలో 95 పోస్టుల భర్తీకి (Medical Posts Recruitments) నోటిఫికేషన్ విడుదలైంది.
అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 13, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. అంటే నేడే దరఖాస్తులకు చివరి అవకాశం.
* ఏయే పోస్టులు ఉన్నాయి..
మొత్తం 95 ఖాళీల్లో మెడికల్ ఆఫీసర్లు, MLHP/CHO, స్టాఫ్ నర్సులు, ANMలు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, పీడియాట్రీషియన్లు, అనస్థీషియన్లు, OBG స్పెషలిస్టులు, సైకాలజిస్టులు, సోషల్ వర్కర్లు తదితర పోస్టులు ఉన్నాయి.
* అర్హతలు, వయోపరిమితి..
పోస్టును బట్టి సంబంధిత విద్యార్హతలు అవసరం. ANM, నర్సింగ్, ఫార్మసీ, వైద్య విద్య, సంబంధిత డిగ్రీలు కలిగిన అభ్యర్థులు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2026 జూలై 1 నాటికి వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
* వేతనం ఎంతంటే?
ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకు రూ.19,500 నుంచి రూ.1,00,000 వరకు వేతనం చెల్లిస్తారు. నియామకాలు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానంలో చేపట్టనున్నారు.
* దరఖాస్తు విధానం..
అభ్యర్థులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారిక వెబ్సైట్ https://kothagudem.telangana.gov.in/ నుంచి దరఖాస్తు ఫారమ్ డౌన్లోడ్ చేసుకోవాలి. పూర్తిచేసిన దరఖాస్తుతో పాటు అవసరమైన ధ్రువపత్రాల స్వీయ ధ్రువీకరించిన ప్రతులు, 1 నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు జతచేయాలి.
దరఖాస్తు ఫీజుగా రూ.1,000 డిమాండ్ డ్రాఫ్ట్ సమర్పించాలి. ఈ డీడీని District Medical and Health Officer, Bhadradri Kothagudem పేరుతో తీసుకోవాలి.
* ఎక్కడ సమర్పించాలి..
పూర్తి చేసిన దరఖాస్తులను స్వయంగా లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, IDOC కాంప్లెక్స్, పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పంపించాలి. ముఖ్యమైన తేదీ, నవంబర్ 13, 2026 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు కార్యాలయానికి చేరాలి.
కాబట్టి అర్హత ఉన్న (Medical Posts Recruitments) అభ్యర్థులు ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు, పోస్టుల వారీగా విద్యార్హతలు తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ను పరిశీలించాలి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

