* మరోసారి రైతుపై దాడి
* పలు గ్రామాల్లో 144 సెక్షన్
* ఆ ప్రాంతానికి మళ్లీ వచ్చే చాన్స్ ఉందని అధికారుల హెచ్చరికలు
ఆకేరు న్యూస్, ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ జిల్లాలో ఓ పెద్ద పులి టెర్రర్ (TIGER TERROR) పుట్టిస్తోంది. పులి దాడిలో యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన జరిగిన మరుసటిరోజే.. సిర్పూర్(టీ) మండలం దుబ్బగూడలో ఓ రైతు(FORMER)పై పులి దాడి చేసింది. పొలంలో పనిచేస్తున్న సురేశ్‌పై దాడికి పాల్పడింది. స్థానికులు కేకలు వేయడంతో పులి అక్కడి నుంచి పారిపోయింది. రైతు సురేశ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పులి సంచారం, దాడిపై ఆసిఫాబాద్ డీఎఫ్‌వో(DFO) స్పందించారు.
రెండోసారి పులి దాడి ఘటన దురదృష్టకరమని డీఎఫ్‌వో అన్నారు. ఈ నేపథ్యంలో కాగజ్‌నగర్ మండలంలోని పలు గ్రామాల్లో ఆంక్షలు విధించారు. ఈజ్గామ్, నజ్రూల్ నగర్, సీతానగర్, అనుకోడా, గన్నారం, కడంబా, ఆరెగూడ, బాబూనగర్, చింతగూడ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఆయా గ్రామాల ప్రజలు పంట చేలకు, అటవీ ప్రాంతాలకు వెళ్లకుండా 144 సెక్షన్ (144 SECTION) విధించారు. దాడి చేసిన చోటుకే పులి మళ్లీ వచ్చే అవకాశం ఉందని, అటువైపు ఎవ్వరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
