* ఈదురుగాలుల తీవ్రతకు కూలిన చెట్లు
* విపత్తు నిర్వహణ కేంద్రాన్ని సందర్శించిన సీఎం స్టాలిన్
* రాత్రి 7 గంటల వరకు చెన్నై విమానాశ్రయం మూసివేత
ఆకేరు న్యూస్, డెస్క్ : భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులకు తమిళనాడు(TAMILANADU) అల్లాడుతోంది. ఫెయింజల్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై(CHENNAI), పుదుచ్చేరి(PUDHUCHERI)లో ప్రభావం ఎక్కువగా ఉందని ఆ రాష్ట్ర అధికార యంత్రాంగం వెల్లడించింది. నీరు నిలిచిన ప్రాంతాల్లో 1666 మోటార్లతో చైన్నయ్లో మోటారు పంపుతో నీటిని తొలగిస్తున్నారు. ఫెయింజల్ తుఫాను ప్రభావానికి తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయి. రాత్రి 7 గంటల వరకు చెన్నై విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. విపత్తు నిర్వహణ కేంద్రాన్ని సందర్శించిన సీఎం స్టాలిన్(CM STALLIN).. పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. వరద సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు.
………………………………………