Kamalapur BJP Farmers Protest
* ధాన్యం కొనుగోలు సమస్యలపై రేవంత్ సర్కార్ పై బీజేపీ పోరుబాట
* కమలాపూర్‌లో రైతులతో కలిసి మహా ధర్నా
ఆకేరు న్యూస్, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మండల బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. రైతన్నలతో కలిసి కమలాపూర్ బస్టాండ్ కూడలి వద్ద ప్రధాన రహదారిపై బీజేపీ నాయకులు బైఠాయించారు. రైతు లేనిదే రాజ్యం లేదు – రైతన్నకు న్యాయం బీజేపీ ధ్యేయం అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్ మాట్లాడుతూ.. రైతులకు గత ఏడాది రావాల్సిన సన్నవడ్ల బోనస్ ఇప్పటికీ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మే నెల మొదటి వారంలోనే పంపిణీ చేయాల్సిన జీలుగ విత్తనాలను ప్రభుత్వం ఇప్పటివరకు సరఫరా చేయలేదని అన్నారు. ధాన్యం సేకరణలో మిల్లర్లకు లాభం చేకూర్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, A గ్రేడ్ ధాన్యాన్ని B గ్రేడ్ ధాన్యంగా మారుస్తున్నారని ఆయన ఆరోపించారు. మండల కాంగ్రెస్ నాయకులు కొనుగోలు కేంద్రాల్లో ఫోటోలు తీసుకుంటున్నారే తప్ప రైతు సమస్యలను పట్టించుకోవట్లేదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని, ఇది రైతు రాజ్యం కాదని రైతులను ఏడిపించే రాజ్యమని అన్నారు. రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు బీజేపీ తరపున పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు లు తూర్పాటి భాస్కర్, జెట్టి సారంగపాణి, సర్పంచ్, నాయకులు పబ్బు సతీష్ , బండి కళాధర్, కొత్త పల్లి రాజు, కట్కూరి అశోక్ రెడ్డి , తుమ్మ శోభన్, భూపతి ప్రవీణ్, పెండ్యాల తిరుపతి రెడ్డి, మేడిపల్లి రాజు, చిట్టి సుందరయ్య, ఓసుకుల కీర్తన, సన్నపు పద్మ, ఇజ్జిగిరి సంపత్, రజనీ కాంత్, బుర్ర కుమారస్వామి, మేర ప్రసాద్, బోయిని సుభాష్ చందర్ సింగ్, మార్క్ అశోక్, కనుకుంట్ల అరవింద్ మౌటం సంపత్, వలిగే సాంబరావు, శనిగరపు సంపత్, పెద్ద ఎత్తున రైతులు,పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
