ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : హైదరాబాద్ లో ఆశాఢ మాసం బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బోనాల జాతరకు నగర ప్రజలు పెద్ద ఎత్తున హజరయ్యారు. గోల్కొండ కోటలో కన్నుల పండువగా ప్రారంభమైన బోనాల వేడుకలకు తొలిరోజే రెండు లక్షల పై చిలుకు మంది హాజరయ్యారని అధికారులు చెప్తున్నారు. తొలిబోనం జగదాంబికా అమ్మవారికి సమర్పించారు. శివసత్తులతో పాటు పోతురాజుల నృత్యాలతో గోట ప్రాంతం దద్దరిల్లింది. సంప్రదాయం ప్రకారం స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్,దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలతో తొలిబోనం సమర్పించారు. బోనాల నిర్వహణ కోసం ఈ సారి 20 కోట్లను ప్రభుత్వం అదనంగా మంజూరు చేసింది. పట్టణ ప్రజలతో పాటు విఐపీలు తొలిరోజు బోనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ విజయశాంతి, తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కవిత, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ మేయర్ విజయలక్ష్మి,పోలీస్ కమిషనర్ సీవి ఆనంద్ తదితురులు బోనాల వేడుకల్లో పాల్గొన్నారు.
………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
