Sallakonda Srikanth Join to congress
* కాంగ్రెస్ లోకి యువ నాయకుడు సల్లకొండ శ్రీకాంత్
ఆకేరు న్యూస్, కాగజ్ నగర్ : నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాగజ్ నగర్ మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్ సల్లగొండ భాగ్యలక్ష్మి కుమారుడు,యువ నాయకుడు సల్లకొండ శ్రీకాంత్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ఆధ్వర్యంలో, ఆయన నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈ చేరిక జరిగింది. సల్లకొండ శ్రీకాంత్ తో పాటు మాజీ కౌన్సిలర్ ఎల్లేష్, యువ నాయకుడు ఎన్నం శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ లో చేరుతున్నారని అన్నారు.
పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాగజ్ నగర్ మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు,పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

