ఆకేరు న్యూస్ తాడ్వాయిః తాడ్వాయి మండలం విలేఖరి శ్రీకాంత్ రెడ్డి పై దాడి చేయడం హేయమైన చర్య అని బి ఆర్ఎస్ జిల్లా నాయకుడు రామ సహాయం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అవకతవకల గురించి పత్రికలో వార్త రాసినందుకు కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేక రిపోర్టర్ పై దాడి పాల్పడ్డారని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. అధికారంలో ఉండి ప్రతిపక్షాలను గొంతు నొక్కాలని చూస్తున్న కాంగ్రెస్ నాయకులు, సమాజంలో జరుగుతున్న అవకతవకలను, లోపాలను వెలికి తీసే జర్నలిస్టులపై దాడులు చేయడం హేయమైన చర్యఅని మండిపడ్డారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రాబోవు రోజులలో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.ఈ సమావేశంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దండగల మల్లయ్య, నాయకులు ఇందారపులాలయ్య, శేషగిరి, జాజ చంద్రం, ఇంద్రారెడ్డి, సోమ నాగమ్మ, దానక నరసింహారావు, కొండూరి నరేష్, సాయిరి లక్ష్మీనర్సు, నరసింహయ్య తో పాటు బి ఆర్ఎస్ నాయకులు తదితరులున్నారు.
………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
