* తెలంగాణ భవన్ నుంచి మిర్యాలగూడకు పయనం
* సాయంత్రం యాత్ర ప్రారంభం
* 17 రోజులపాటు 12 లోక్‌సభ నియోజకవర్గాల్లో..
* మే 10న ముగింపు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
ప్రజల్లోకి వెళ్లేందుకు గులాబీ రథం సిద్ధమైంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి పయనం మొదలుపెట్టింది. బస్సుకు తెలంగాణ భవన్లో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గులాబీ బాస్ కేసీఆర్ బస్సు యాత్ర ఈరోజు సాయంత్రం 5.30కు మిర్యాలగూడలో ప్రారంభం కానుంది. ఈమేరకు నందినగర్ నివాసం నుంచి బుధవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేసీఆర్ అక్కడి నుంచి బస్సులో మిర్యాలగూడకు బయలుదేరారు. ఆయన వెనుక 50 కార్లలో, వంద మంది వలంటీర్లు ఉన్నారు. సా. 5.30కు మిర్యాలగూడలో బస్సు యాత్ర ప్రారంభం కానుంది. అక్కడి సూర్యాపేట వరకు యాత్ర కొనసాగుతుంది.
17 రోజులు 12 లోక్‌సభలు
నేటి నుంచి 17 రోజుల పాటు సాగే ఈ యాత్రకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. మే 10న సిద్దిపేట సభతో ఈ యాత్ర ముగియనుంది. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కేసీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. దాదాపు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్‌షోలు ఉండే విధంగా బస్సు యాత్రను ప్లాన్ చేశారు. 12 లోక్‌సభ నియోజకవర్గాలలోని ప్రాంతాల గుండా ఈ యాత్ర కొనసాగనుంది.
————————–