* ప్రతిపక్షంల ఉన్నంత పోరాట స్ఫూర్తి,
* స్వేచ్ఛ అధికారపక్షంలో సాధ్యపడదు
* విజయశాంతి సంచలన వ్యాఖ్యలు
* ఈ కామెంట్ల మర్మమేంటి ..?
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : కాంగ్రెస్ నాయకురాలు సినీ నటి విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విటర్ ( ఎక్స్ ) వేదికగా తన ఆలోచనలను ప్రజలతో పంచుకున్నారు. విజయశాంతి సీనియర్ రాజకీయ నాయకురాలు, తెలంగాణ ఉద్యమం, బీజేపీలో పార్టీలో కూడా క్రియాశీలక భూమిక పోషించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 17 నవంబర్ 2023 న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుందని అందరు అనుకున్నారు. ఎంపీ టికెట్ దక్కక పోగా కాంగ్రెస్ పార్టీలో ఏ మాత్రం ప్రాథాన్యత లేని నాయకురాలిగా మిగిలింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఎక్స్ ఖాతాలో ఆమె ఆలోచనలు అనే కంటే ఆవేదనను పంచుకున్నట్లుగా ఉంది.
* ప్రజల వైపు ఉండడం నాధోరణి .
ప్రభుత్వం వైపు కన్నా.. ప్రజల వైపు ఉండటం నా ధోరణి, బహుశా అందుకు కారణం. ఎప్పుడూ నా తిరుగుబాటు స్వభావపు సినిమా పాత్రల ప్రేరణ కావచ్చు.కొంతమంది విమర్శించినా.. ఎందుకో అదే విధానం నన్ను అట్లముందుకు నడిపిస్తూనే వస్తున్నది.ఈ 26 వ సంవత్సరాల రాజకీయ గమనంల…
ప్రతిపక్షంల ఉన్నంత పోరాట స్ఫూర్తి, స్వేచ్ఛ అధికారపక్షంల సాధ్యపడకపోవడం కూడా ఒక వాస్తవమేమో నాకు తెలియదు. ఐతే నేను గెలిపించనీకి పనిచేసిన నేటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశలను నెరవేర్చే సాఫల్యత తెలంగాణల సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ…
ముఖ్యమంత్రి రేవంత్ , ఉప ముఖ్యమంత్రి భట్టి , మంత్రివర్గం ప్రజలకై ఆ దిశగా ఇప్పటికీ పనిచేస్తున్నరు కాబట్టి….అమలు ప్రారంభమైన
హామీలు దశలవారీగా పూర్తిస్థాయికి చేర్చబడి , ప్రభుత్వ కార్యాచరణ విజయం దిశగా సాగాలని నా అభిప్రాయం తెలియజేస్తూ..లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించగలదని విశ్వసిస్తూ… మీ విజయశాంతి అంటూ ముగించారు..
————————-