BTech student suicide depression
ఆకేరు న్యూస్ డెస్క్ : కన్న తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక, ఆ జ్ఞాపకాల నుండి బయటపడలేక ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. “నాన్న లేని లోకంలో నేను ఉండలేను” అంటూ సూసైడ్ నోట్ రాసి తనువు చాలించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.ఏలూరు జిల్లాలోని చిత్రాయి గ్రామానికి చెందిన జ్ఞానశ్రీ (21) హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి చెన్నకేశవరెడ్డి గత నెల మార్చి 31న అనారోగ్య కారణాలతో మరణించారు. తండ్రి అంటే అమితమైన ఇష్టం ఉన్న జ్ఞానశ్రీ, ఆయన మరణం తర్వాత తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఎంత ఓదార్చినా ఆమె మనసు కుదుటపడలేదు.
*ఉరివేసుకుని ఆత్మహత్య
శుక్రవారం ఇంట్లో కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయంలో, ఒంటరిగా ఉన్న జ్ఞానశ్రీ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎంతసేపటికీ గది నుండి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు తలుపులు పగులగొట్టి చూడగా, ఆమె విగతజీవిగా కనిపించింది.
*పోలీసుల దర్యాప్తు – సూసైడ్ నోట్
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆమె గదిలో లభ్యమైన సూసైడ్ నోట్ పోలీసులకు దొరికింది. అందులో:
”నాన్న చనిపోయినప్పటి నుండి నేను ప్రతి క్షణం ఆయననే తలుచుకుంటున్నాను. నాన్న లేని జీవితం నాకు వద్దు. నేను ఆయన దగ్గరికే వెళ్తున్నాను” అని రాసి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
*చిత్రాయి గ్రామంలో విషాద ఛాయలు
కొద్దిరోజుల క్రితమే ఇంటి యజమానిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి, ఇప్పుడు కూతురు కూడా దూరమవ్వడంతో పరిస్థితి హృదయవిదారకంగా మారింది. ఉన్నత చదువులు చదివి ప్రయోజకురాలు అవుతుందనుకున్న కూతురు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో చిత్రాయి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
*ఒంటరితనం , ఒత్తిడి ఉన్నప్పుడు మాకు కాల్ చేయండి
*ఆత్మహత్య పరిష్కారం కాదు
ఒంటరితనం లేదా మానసిక ఒత్తిడితో బాధపడుతుంటే ఆత్మహత్య పరిష్కారం కాదు. దయచేసి స్నేహితులతో లేదా కౌన్సిలర్లతో మాట్లాడండి.
హెల్ప్‌లైన్ నంబర్లు: 100 లేదా 040-66202000 (రోష్ని
Please tell us what is wrong. Your report will be sent to the website team.
