₹6.69 Crore False FIR Case
* తప్పుడు ఎఫ్ఐఆర్?
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తప్పుడు ఎఫ్ఐఆర్తో పరువు నష్టం, కుట్ర ఆరోపణలు చేస్తూ అన్యాయంగా తనను ఇరికించారని వ్యాపారవేత్త నితేష్ విజయవర్గీయా.. ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్ల్యూ), సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రూ.6.69 కోట్ల వివాదానికి సంబంధించి ఆయన పలువురిపై ఆరోపణలు చేశారు. తప్పుడు ఫిర్యాదుల ఆరోపణలపై ఎల్బీనగర్లోని ప్రథమ జూనియర్ సివిల్ జడ్జి కమ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణ జరిపింది. పలువురిపై కేసు నమోదుకు ఆదేశించింది.
* బకాయిలు ఉండి ఉల్టా కేసు..
రాజ్‌కుమార్ రాయ్, అనన్య భట్లు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఫిర్యాదు చేసి తమపై క్రిమినల్ కేసు నమోదు చేయించారని నితేష్ విజయవర్గీయా.. కోర్టులో పిటిషన్ వేశారు. తమ కుటుంబ సభ్యులు ఆర్థిక రుణదాతలుగా అనన్య ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నిధులు అందించగా, ఆ రుణాలు దివాలా పరిష్కార ప్రక్రియలో అధికారికంగా ధృవీకరించబడి గుర్తింపు పొందినట్లు వివరించారు. అనంతరం బకాయిలు చెల్లించకుండా తప్పించుకునేందుకే నకిలీ పత్రాలు, ఫోర్జరీ ఆరోపణలతో తమపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అనన్య ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ రాజ్‌కుమార్ రాయ్‌కు సంబంధించిన ఇతర సంస్థల నుంచి మొత్తం రూ. 6,69,00,867లు బకాయిలు రావాల్సి ఉన్నాయి. ఇందులో ఎన్సీఎల్టీ పరిధిలో గుర్తింపు పొందిన సీఐఆర్‌పీ క్లెయిమ్‌తో పాటు వ్యక్తిగత, అనుబంధ సంస్థల బకాయిలు కూడా ఉన్నాయి. అలాగే, 2022లో ముగిసిన దివాలా పరిష్కార ప్రక్రియ సమయంలో రుణ నిర్ధారణ పత్రాలు, ఇతర ఆర్థిక పత్రాలను ఇంటరిమ్ రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఐఆర్పీ) పరిశీలించి ధృవీకరించినప్పటికీ, అప్పట్లో ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు.
* నాలుగేళ్ల తర్వాత..
నాలుగేళ్ల తర్వాత ఉల్టా ఫోర్జరీ ఆరోపణలు చేయడం ప్రారంభించారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఆరోపణలు, ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది దురుద్దేశపూర్వక చర్యగా ఫిర్యాదులో పేర్కొన్నారు. బాచారం భూమికి సంబంధించి రూ.200 కోట్ల నష్టం జరిగిందన్న ఆరోపణలు కూడా వాస్తవాలకు విరుద్ధమని, ఆ భూమి ఇప్పటికే మూడో పక్షానికి విక్రయ ఒప్పందం కుదిరి, పూర్తి చెల్లింపులు జరిగిన విషయాన్ని దాచిపెట్టి తప్పుడు కథనం సృష్టించారని ఆరోపించారు. కోర్టు ఆదేశాల మేరకు దీనిపై కేసు నమోదైంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
