కాగ్ రిపోర్ట్
– అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గత బీఆర్ ఎస్ ప్రభుత్వం (BRS Government) 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన పరిమితి కన్నా 6 శాతం రుణాలు ఎక్కువ రుణాలు తీసుకుందని కాగ్ నివేదిక (CAG Report) వెల్లడించింది. ఎస్సీ అభివృద్ధి నిధుల్లో 58 శాతం, ఎస్టీ నిధుల్లో 38 శాతం వినియోగించలేదని తెలిపింది. ఖర్చు అయిన ఎస్సీ (SC), ఎస్టీ (ST) ప్రత్యేక అభివృద్ధి నిధులను సైతం గత సర్కార్ దారిమళ్లించినట్లు రిపోర్టులో పొందుపరిచింది. తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) సాగునీటి ప్రాజెక్టులకు సంబందించిన 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను కాగ్ నివేదికను అసెంబ్లీ (Assembly) లో ప్రవేశపెట్టింది. రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై గత ఐదేళ్లలో ఎక్కువ ఖర్చులు చేశారన్నారు. 1983 నుంచి 2018 మధ్య కాలంలో 20 సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం ప్రారంభం అయితే… లక్షా 73 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం లక్ష కోట్ల నుంచి 2 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. ఇచ్చిన రుణాల అడ్వాన్సులు భారీగా ఉన్నాయని కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project), మిషన్ భగీరథ (Mission Bhagiratha) కే ఎక్కువ రుణాలు తీసుకున్నారని రిపోర్ట్ (Report) లో కాగ్ వెల్లడించింది. కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాలను మళ్లీ చెల్లించేందుకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది. బడ్జెటేతర రుణాలను తిరిగి చెల్లించేందుకు సైతం ఇబ్బంది తప్పదని తెలిపింది.
———————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
