* కేసీఆర్ కుటుంబాన్ని కాపాడాలని కిషన్ రెడ్డి చూస్తున్నారు
* మేం వదిలిపెట్టేది లేదు.. త్వరలో అరెస్టులు ఉంటాయి
* లోకేష్‌తో అర్దరాత్రి మీటింగ్ ఎందుకో కేటీఆర్ చెప్పాలి
* ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanthreddy).. అక్కడ మీడియాతో ఇష్టాగోష్టిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు వేగవంతం చేశామని, కేసుల విచారణను కేంద్రమే ఆపుతోందని ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిపై కేంద్రం ఏమీ చేయలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాకే అరెస్టు చేస్తున్నామని, ఇది తమ నిబద్ధత అని వెల్లడించారు. కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టేది లేదన్నారు. తమకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. సమస్యల పరిష్కారంపై అవగాహన ఉన్నట్లు తెలిపారు. శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచన చేస్తున్నామని తెలిపారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)ల్లో హడావుడి చేయడం లేదని.. నిందితుల్ని వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. కేసీఆర్ (Kcr) కుటుంబాన్ని కాపాడేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, తాము వదిలి పెట్టే ప్రశ్నే ఉండదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. టీడీపీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ను కలిశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక విషయం బయట పెట్టారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి అక్కడ కేంద్ర మంత్రులతో సమావేశాల తర్వాత మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా నారా లోకేష్‌తో కేటీఆర్ భేటీ గురించి ప్రస్తావించారు. అర్థరాత్రి లోకష్‌తో డిన్నర్ ఏమీటింగ్ ఎందుకు చేశారో చెప్పాలన్నారు.
…………………………………………….
